← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

FUEL ప్రాజెక్టు.- లిబ్రెఆఫీస్ లో స్థానికీకరణ మార్పులు చేసిన అనుభవాలు

 

నమస్తే,

కొత్తగా విడుదలైన లిబ్రెఆఫీసు  3.3 RC3
<http://www.documentfoundation.org/>తెలుగులో
100 పైగా పదాలు సమీక్ష వలన మార్చబడ్డాయి. ఉదాహరణకి, తెలుగుపదంలో చర్చల వలన
వచ్చిన INSERT అనే పదానికి  చొప్పించు అన్న అనువాదం చూడవచ్చు.

ఈ మార్పులు చేయటానికి Bluefish, Localize లాంటి సాఫ్ట్వేర్లు వాడాను. ఒక్కోసారి
రెండు మూడు ఇంగ్లిషు పదాలకు ఒకటే తెలుగు పదం వాడితే మార్పులు చేయటానికి సరియైన
సందర్భం కోసం  రెగ్యులర్ ఎక్స్ప్రెషన్  వాడి  వెదకాలి. ఈ లిబ్రెఆఫీసు అనువాద
సంస్కరణ దాదాపు నెలరోజుల పూర్తిపనికాలం పట్టింది (కొత్త సాఫ్ట్వేర్ల గురించి
తెలుసుకోవటం అనువర్తనం వాడటంతో కలుపుకొని). ఎందుకంటే అది మొదట చేసిన వారు
అనువర్తనంపై సరియైన అవగాహనలేకుండా, అనువాద సాఫ్ట్వేర్లు వాడటం, చాలా చోట్ల
తెలుగు వ్యాకరణమునకు మార్చకుండా చేశారు. వారు చేసినది సరిగా వున్నదా లేదా
అనిపరిశీలించకుండా  విడుదలచేశారు. అలా అని వారు చేసిన పనితక్కువచేయటం లేదు
గాని  ప్రాజెక్టు  ప్రారంభించితే దానిని సరిగా పూర్తిచేయటం ఎంత ముఖ్యమో
తెలియచేస్తున్నాను.

ఇంకొన్ని విషయాలు..

1) FUEL <https://fedorahosted.org/fuel/wiki/fuel-telugu>ప్రాజెక్టు
సమీక్ష<http://teluginux.blogspot.com/2010/11/fuel-telugu-28-29-2010.html>షీట్లో
 పదాలు కొన్ని కనబడలేదు. కొన్ని పదాలు మార్చాలని తీసుకొన్నా వాటిని,
అనువర్తనమును వాడిన సందర్భము అర్ధమైనపుడు అవసరంలేదని తొలగించాను.
2) అనువర్తనము వాడకుండా మనము సరైన అనువాదం అనుకున్న పదాలు  సరిగా వుండవు.
సమీక్ష అయిన మార్పులు కొన్ని వదలివేశాను.
3) గ్రాంథిక వ్యాకరణ దోషాలకు అతితక్కువ ప్రాధాన్యత. ఉదాహరణకు వాక్యం లేక పదబంధం
మధ్యలో ఇ, ఉ లాంటివి అచ్చుతో ప్రారంభమైతే ఫరవాలేదు.  భద్రిరాజు రాధాకృష్ణ గారి
"పత్రికా పదకోశం" లోని  "నా మాట" లో అలాగే వాడారు.
4) అక్షరక్రమ తనిఖీ గురించి  వస్తే  చేకూరి రామారావు  పత్రికా పదకోశంలో రాసిన
మాటలు
"తెలుగులో వర్ణక్రమవ్యవస్థ ఇంకా సరిగ్గా ఏర్పడలేదు. ఒకే మాట అనేక లేఖన
పద్ధతుల్లో కనిపిస్తుంది. సంధికూడా ఒకసారి చేస్తాం, ఒకసారి చేయం. ఈ కోశంలో కొంత
నియతిని పాటించాం కాని, అన్ని వేళలా ఆ నియతికి కట్టుబడడం కుదరలేదు"
అందుకని సంధి సమాసాలకు ఎక్కడ ఖాళీ వదలాలి లేక వదలకూడదు అన్నది మనం పెద్దగా
పట్టించుకోనక్కరలేదు.

ఈ మార్పులన్నీ చేసినతరువాత నాకు అర్థమయ్యింది ఏమిటంటే మనము
స్థానికీకరణచేయబోతున్నా లేక మార్చబోతున్న  అనువర్తనము వాడితే అనువాద పదాలు
సరియైనవా కావా అని నిర్ణయించటం  సులభం. కంప్యూటర్లో వివిధ ప్రత్యేక అంశాల కోసం
పదకోశాలు తయారు చేయాలి. ముందు ముందు ఇవి ఎవరు స్థానికీకరణ చేసినా వాడాలి. ఈ
దిశగా లిబ్రెఆఫీసు
పదకోశం<https://sites.google.com/site/linuxteluguusers/paribhasika-padakosalu>తయారైంది.
ఇంకా ఫ్యూయల్ ప్రాజెక్టుతో సరిచూడాలి.

నా అనుభవం ప్రకారం సలహా ఏమిటంటే మనం పూర్తి తెలుగు వాడుక విధానం(interface) లో
మునిగి పనిచేయకపోతే (కనీసం ఇంటి కంప్యూటర్ లో, వీలయినంతవరకు విండోస్ వారైనా లేక
లినక్స్ వారైనా లేక వెబ్సైట్లు వాడేవారైనా) సరియైన పదాలు నిష్పాదించటం కష్టం.

తెలుగుపదం , తెలుగుబ్లాగ్  మరి యితర గ్రూప్ ల సభ్యులు, లినక్స్ వాడేవారు మొదట
తెలుగు విధానానికి మారి (గనోమ్, ఫైర్ఫాక్స్, లిబ్రెఆఫీస్,జిమెయిల్ అన్నీ
తెలుగులో) మిగతా వారికి మార్గదర్శకం కావాలి.

చివరిగా ఈ ప్రక్రియలో సహకరించిన కృష్ణ, పవిత్రన్, నాగార్జున విశ్వవిద్యాలయ
ఆచార్యులు, విద్యార్థులు, తెలుగుపదం ఇతర గుంపులలో సభ్యులకు ధన్యవాదాలు.

మీ స్పందనలు పంచుకోండి.

శుభం
అర్జున