← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో e తెలుగు - తెలుగు వికిపీడియా స్టాలులో ఉండటానికి ఔత్సాహికులు కావాలి. మీకు వీలైనంత సమయమే స్టాలు వద్ద గడపవచ్చు

 

ఎప్పటి లాగానే హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో తెలుగు బ్లాగులకై ఓ స్టాలుని
తీసుకుంటున్నాం.  పుస్తక ప్రదర్శలలో మన కార్యక్రమాలు చాలా ప్రభావవంతంగా
ఉంటాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే, పుస్తక ప్రదర్శనకి వచ్చేవారిలో చదివే ఆసక్తి
ఉన్నవాళ్ళు ఎక్కవ శాతం ఉంటారు కాబట్టి. ,స్టాలులో ఉండటానికి ఔత్సాహికులు
కావాలి. మీకు వీలైనంత సమయమే స్టాలు వద్ద గడపవచ్చు.
పుస్తక ప్రదర్శనలో e తెలుగు - తెలుగు వికిపీడియా  స్టాలు నెంబరు 171 మీడియా
స్టాళ్ళ  దగ్గర : ప్రవేశద్వారానికి  ఎదురుగా

మీ వద్ద ల్యాపుటాపులు (అంకోపరులు) ఉంటే తప్పక తీసుకురండి. జాలానుసంధానం
లేకుంటే, వై -ఫై  ప్రోవైడు చేయగలము  , మీ బ్లాగు యొక్క మరియు మీకు నచ్చిన
తెలుగు బ్లాగుల మరియు సైట్ల యొక్క తెరపట్టులను భద్రపరచుకుని రండి. స్టాలు
సందర్శకులకి
మీరే ప్రత్యక్షంగా చూపిస్తే ఆ అనుభూతే వేరు.

స్టాలుని ప్రదర్శన నడిచిన రోజులు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ
నడపాలి. కనీసం నలుగురు ఉంటే బాగుంటుందనుకుంటున్నాం.

శని మరియు ఆదివారాలకి బానే దొరుకుతారు. కాబట్టి వారంలోని మిగతా రోజులలో అక్కడ
ఉండి సందర్శకులని సంభాళిస్తే చాలు.

అన్ని రోజులూ ఒక్కరే ఉండలేరు కాబట్టి ఒక్కో రోజూ ఒక్కొక్కరూ వంతుల వారీగా
చెయాల్సిరావచ్చు. మీకూ ఏయే రోజులలో వీలవుందో చెప్తూ ఇక్కడ స్పందించండి.
(దీనికోసం ఓ పూట మీ కార్యాలయం నుండి సెలవు తీసుకునే దిశగా కూడా ఆలోచించండి.)
ఇతరత్రా విషయాల్లో సందేహాలుంటే అడగండి.

అలాగే, e-తెలుగు స్టాలులోనూ, సందర్శకులతోనూ మీ అనుభవాలను , మీ బ్లాగు లోనూ,
లేదా  గూగుల్ ప్లస్ , ఫేస్బుక్  లోనూ పంచుకోండి.


స్టాలు సమయాలు: మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు.

ఆసక్తి ఉన్నవారు స్పందించండి. 9396533666  మీ సహాయం మరియు తోడ్పాటు మాకు
ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. మీ నుండి సానుకూల స్పందనని ఆశిస్తూ..

మీ శ్రేయోభిలాషి
కశ్యప్
9396533666
kaburlu.wordpress.com