ubuntu-l10n-te team mailing list archive
-
ubuntu-l10n-te team
-
Mailing list archive
-
Message #00088
Re: లినక్స్ జ్ఞాన తరంగాలు
-
To:
రహ్మానుద్దీన్ షేక్ <nani1only@xxxxxxxxx>
-
From:
Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxx>
-
Date:
Thu, 15 Sep 2011 10:03:10 +0530
-
Cc:
కిరణ్ చావా <chavakiran@xxxxxxxxx>, కార్తీక్ ఇంద్రకంటి <karthikeya.iitk@xxxxxxxxx>, linux-telugu-users@xxxxxxxxxxxxxxxx, jayanth tadinada <mail2g2.rdl@xxxxxxxxx>, నాగార్జున పెరికేటి nagarjuna iit <npchary@xxxxxxxxx>, pavithran <pavithran.s@xxxxxxxxx>, Suresh Kolichala <suresh.kolichala@xxxxxxxxx>, ubuntu-l10n-te <ubuntu-l10n-te@xxxxxxxxxxxxxxxxxxx>, Gavesh Y <ygavesh@xxxxxxxxx>, sunilmohan@xxxxxxxxxx, Kranthi Kumar Boyapati <krannycool@xxxxxxxxx>, Gopala Krishna Koduri <gopal.iiit@xxxxxxxxx>, రాజ్ కుమార్ <rajkumar.neelam@xxxxxxxxx>, Ravi Chandra Enaganti <ravichandra.enaganti@xxxxxxxxx>, శ్రీనివాస దాట్ల <srinivasaraju.datla@xxxxxxxxx>
-
In-reply-to:
<CAHRpNu321F_J5=oGBgh9otUogr884ZXxOBDTe8b=rTBxNOZVjw@mail.gmail.com>
2011/9/15 రహ్మానుద్దీన్ షేక్ <nani1only@xxxxxxxxx>
>
>
> 2011/9/15 Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxx>
>
>>
>>
>> 2011/9/15 రహ్మానుద్దీన్ షేక్ <nani1only@xxxxxxxxx>
>>
>>> నమస్కారం
>>>
>>> వీవెన్, నేను చర్చించుకున్న ప్రకారం తెలుగులో కన్నడ వారి అరివిన అలెగళు అన్న
>>> పుస్తకం లాగా ఒక పుస్తకం తెద్దామనుకున్నాం.
>>> అరివిన అలెగళు అన్నది కన్నడ వారు వారి భాషలో ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్
>>> సాఫ్ట్వేర్ వాడుక పై రాసిన పద్నాలుగు వ్యాసాల సమాహారం.
>>> గిమ్ప్,డెబియన్, ఉబుంటూ, జీపీఎల్ మొదలు పద్నాలుగు విశయాలపై పద్నాలుగు మంది
>>> నిపుణులు చాలా విశదీకరించి వంద పేజీల పుస్తకాన్ని అందించారు.
>>> ఈ పుస్తకం గురించి హిందూలో ఇచ్చిన వ్యాసం చూడగలరు.
>>> http://www.thehindu.com/todays-paper/tp-national/article2419656.ece
>>>
>>> ప్రతి ఉపకరణం సాధారణ వాడుకరికి ఎలా ఉపయోగపడాలి అన్న లక్ష్యంతో మనం సైతం
>>> ఇలాంటిది ఒక పుస్తకం వెలువరించాలి.
>>> అక్టోబర్ రెండో వారంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఉబుంటూ ౧౧.౧౦ ను తెలుగులో
>>> కూడా అధికారికంగా విడుదల చేద్దాం అన్నది నా ప్రతిపాదన.
>>> విడుదల తేదీకల్లా ఈ వ్యాసాలను ఒక ముద్రిత పుస్తకంగా జనసామాన్యానికి
>>> అందింవచ్చు.
>>> అలానే ఈ వ్యాసాలను రోజుకో వ్యాసంగా ముందు నుండి ప్రచురిస్తూ(ఒక బ్లాగు లేదా
>>> జాలగూడు ద్వారా) అన్ని వ్యాసాలను పుస్తకంగా అందించవచ్చు.
>>> ఈ విషయమై మనం, లినక్స్ స్థానికీకరణ, మీడియావికీ స్థానికీకరణ, వికీపీడియా
>>> మొదలుకొని, గింప్, ఐబస్, స్కిమ్, ఇన్క్ స్కేప్ వంటి ఉపకరణాల మీద వ్యాసాలు
>>> రాయవచ్చు.
>>> గరిష్ఠంగా ఒక పది-పదిహేను పేజీలు వచ్చేలా వ్యాసాలు ఉంటే, ఒక పది వ్యాసాలు
>>> వచ్చినా చాలు.
>>> ఇక్కడ ఈ మెయిలు గొలుసులో మనం ఎవరెవరం ఏ విశయమై రాయాలి అన్నదానిపై
>>> చర్చిద్దాం.
>>> చర్చలకు ఆఖరు తేదీ 20 Sep, 2011.
>>> వ్యాసాలకు ఆఖరు తేదీ 5 Oct, 2011.
>>>
>>> ఇప్పటివరకూ అనుకుంటున్న 13 Oct, 2011 కల్లా జ్ఞాన తరంగాలు అన్న పేరు మీద ఈ
>>> పుస్తకం వెలువరిద్దాం.
>>> ఇది తెలుగు వారిగా మనం చెయ్యాల్సిన కనీస బాధ్యత.
>>>
>>> మీ సలహాలూ సూచనలూ అందించగలరు.
>>>
>>> మీ
>>> Rahimanuddin Shaik
>>> నాని
>>> ॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥
>>>
>> మంచి ఆలోచన, అయితే ఇప్పటికే తెలుగులో విడుదలైన ఉబుంటు వాడుకరి మార్గదర్శని
>> ని మెరుగు పరచి విడుదల చేస్తే మంచిదేమో. ఇది ఒక విధంగా కన్నడ పుస్తకానికి
>> స్ఫూర్తినిచ్చింది.
>> http://te.wikibooks.org/wiki/%E0%B0%89%E0%B0%AC%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%81
>>
>> కేవలం సందర్భం మాత్రమే ఉబుంటు విడుదల. వ్యాసాలూ మామూలు ప్రజలలో లినక్స్
> వాడకం పై చైతన్యం తెచ్చేవిగా ఉండాలి. సాంకేతికంగా కాకుండా జనాలకు
> జీర్ణించుకోటానికి సులభంగా ఉండాలి. ఒక్క ఉబుంటు కి పరిమితం కాకుండా, అన్ని
> స్వేచ్చ ఉపకరణాలను అందించాలి.
>
స్వేచ్ఛా ఉపకరణాలు, స్వేచ్ఛా సాఫ్ట్వేర్ తత్వానికి సంబంధించిన వన్నీ ఇటువంటి
పుస్తకంలో ప్రతిబింబించవచ్చు. వట్టి వ్యాసాలకు బదులుగా, సాఫ్ట్వేర్
వివరణలతో కూడినది,వెంటనే వాడి పరీక్షించుకొనగలేదీ మంచి ఫలితాలనిస్తుందని నా
అభిప్రాయం. ఇప్పటి వరకు చేసినది ముఖ్యంగా తెలుగు వాడటం ఎలా అన్నప్రశ్నకు
సమాధాన్నిస్తుంది. ఇతర పంపిణీల గురించి రాయాలంటే, ఉబుంటు తెలుగు వాడుక ఒక
స్థాయికి చేరిన తరువాత ప్రయత్నించటం మంచిది. మన పరిధి మరీ విస్తృతంగా వుంటే
ఫలితాలు అంతంత మాత్రంగా వుంటాయని నా అభిప్రాయం.
ధన్యవాదాలు
అర్జున
References