← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: లినక్స్ జ్ఞాన తరంగాలు

 

2011/9/15 Praveen Garlapati <praveengarlapati@xxxxxxxxx>

> ఐడియా బాగుంది. నా వంతు సహాయం అందించడానికి ప్రయత్నిస్తాను.
> మీరు సూచించిన ఉపకరణాలు నేను వాడడం తక్కువ :) ఇంకే విషయం గురించయినా
> వ్రాయగలనేమో ప్రయత్నిస్తాను.
>

సరే ఇక ఎవరెవరు ఏ ఏ అంశాలపి రాయాలనుకుంటున్నారో చర్చిద్దాం.
స్థూలంగా నేననుకున్నవి


   1. లినక్స్ పంపకాలు(డెబియన్ పై ఒక వ్యాసం, ఉబుంటూ పై ఒక వ్యాసం, మరేదయినా
   పంపకం పై ఒక వ్యాసం)
   2. లినక్స్ చరితమ్
   3. లినక్స్ స్థానికీకరణ
   4. లినక్స్ విశేషాలు లోటుపాట్లు
   5. స్వేఛ్ఛా ఉపకరణాల చరిత్ర
   6. ఫైర్ఫాక్స్ మొదలగు ఉపకరణాలు
   7. గింప్ మొదలగు ఉపకరణాలు
   8. తెలుగుకు ఓసీఆర్
   9. కాపీరైటు మరియు సీసీ ఇంకా ఇతర లైసెన్సులు, వాటి ప్రాధాన్యతలు
   10. తెలుగులో లేటెక్సు
   11. తెలుగులో సోషల్ నెట్వర్కింగ్
   12. అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో తెలుగు ఉనికి
   13. జాలంలో తెలుగు ఉనికి
   14. ఒక ఐటీ ఉద్యోగి నిత్య జీవితంలో తెలుగు.

ఇవి కాక మరేమయినా విషయాలు ఉంటే తెలుపండి, ఎవరెవరు ఏ ఏ విషయాలపై రాస్తున్నారో
ఇక్కడ చర్చించండి.
ప్రతీ వ్యాసం మీరెంచుకున్నా విషయాన్ని పూర్తిగా తెలిపేదిగా ఉండాలి. మన
పుస్తకానికి చదువరులు స్కూలు విద్యార్థులు మొదలు గృహిణులు, కంప్యూటర్ పరిజ్ఞానం
ఉన్నవారు, ఉపాధ్యాయులు, మున్నగు వారు. అందరికీ జ్ఞానాన్ని ఇచ్చేవిగా వ్యాసాలు
ఉండాలి.
పైన తెలిపిన విధంగా ఆయా తేదీలకల్లా వ్యాసాలు అందేట్టు పంపగలరు.

మీ
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥

Follow ups