← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

తెలుగు స్థానికీకరణ తాజా సమాచారం మరియు కొత్త సంవత్సర ప్రాధాన్యతలు

 

మిత్రులారా,
ఇటీవల నేను లిబ్రెఆఫీసు తెలుగు స్థానికీకరణ
<http://wiki.documentfoundation.org/Te>చాలావరకు పరిష్కరించి, మఖ్యంగా రైటర్
సంవాదాలు అర్ధవంతమైనవిగా మరియు అక్షరక్రమ దోషాలులేకుండా చేసి దాఖలుచేశాను. RC3
తో అది విడుదలవుతుంది.
ఏప్రిల్ చివరికల్లా ఉబుంటు పూర్తి తెలుగు విడుదల చేయటానికి నా వంతు కృషి
చేస్తున్నాను. మీ తోడ్పాటు, సహయం కోరుచున్నాను. దీనికోసం ముఖ్యంగా చేయవలసినవి
1) విండోస్ వ్యవస్థలలో డిస్క్ విభజన(Partition) మార్పులు అవసరంలేకుండా
స్థాపించగల మాడ్యూల్
వూబి<https://translations.launchpad.net/wubi/trunk/+pots/wubi/te/+details>స్థానికీకరణ
( 100 పదబంధాలు)   (ఉబుంటులో తెలుగు బూట్ స్థాయి నుండి కనబడుటానికి
చర్యలు. డెబియన్ ఇన్స్టాలర్ అనువాదం పూర్తయ్యింది.)
2) తెలుగు టైపింగ్ ట్యూటర్ వుపకరణం klavaro
౩) లిబ్రెఆఫీసు రైటర్, ఇంప్రెస్ సహాయ ఫైళ్లు
3) విద్యా అనువర్తనములు,
చిన్న పిల్లలకొరకు  gcompris <http://gcompris.net/-en->
 విషయానికొకటి చొప్పున
తెలుగు klettres <http://edu.kde.org/klettres/> అక్షరం టైపింగు అనుభవ వుపకరణం
(పవిత్రన్ కొంత చేశాడు)
లెక్కలు geogebra <http://www.geogebra.org/cms/>
సామాజికశాస్త్రం ..గుర్తించాలి
విజ్ఞానశాస్త్రం .. గుర్తించాలి
మీ సలహాలతో స్పందించిండి

లినక్స్ తెలుగు వాడుకరుల
వెబ్సైటు<https://sites.google.com/site/linuxteluguusers/>   చూస్తూ
వుండండి.

ధన్యవాదాలు
అర్జున

Follow ups