ubuntu-l10n-te team mailing list archive
-
ubuntu-l10n-te team
-
Mailing list archive
-
Message #00051
Re: కొన్ని అభ్యర్థనలు
గోపాల్ గారు
2011/2/19 Gopal/గోపాల్ <gopal.iiit@xxxxxxxxx>
> అర్జున రావు గారు,
>
> మీరు చెప్పిన సందర్భం లో చిన్న పదానికి ప్రాముఖ్యత ఉండబట్టి ఒప్పుకుంటాను.
> చిన్న చిన్న పదాలు, డయలాగ్ బాక్సుల్లో వచ్చేవి పెద్దగా ఉంటే ఇబ్బందే. కానీ
> ఏదైనా వాక్యం లో అలాంటి పదాలు ఎదురైతే అనువాదం లో కొంచెం లిబెరల్ గా ఉండటం
> మంచిదనుకుంటాను. రామాయణ మహాభారతాల్లో వాడిన శైలి కాకుండా ఈ మధ్య వచ్చే కథలు,
> నవలల్లో లాగా ఉంటే సులువుగా ఆకట్టుకుంటుంది, లినక్సు తెలుగులో. తప్పుగా
> అనుకోకండేం..
>
> కాదూ కూడదు, తప్పదు అంటే ఏం చేస్తాం, నాకు పాండిత్యం ఎటూ లేదు కాబట్టి
> నలుగురితో పాటు నారాయణా అంటాను :-)
>
> నాకు మాత్రం పెద్ద పాండిత్యం వుందనికాదు.
మేము నాగార్జున వివి తెలుగు శాఖ ఆచార్యులతో చర్చించినపుడు అంగీకరించిన
సూత్రాలను మాత్రమే మనవిచేస్తున్నాను. ఏకరూపత సాధించటానికి ఒకే రకంగా వాడటం
మంచిది.
తెలుగు పదం లో మరల మనం చర్చించాలనుకుంటే మంచిదే, కాకపోతే తెలుగులో కంప్యూటర్
వాడే వారినుండి స్పందనలు వస్తే బాగుంటుంది.
ధన్యవాదాలు
అర్జున
> Regards,
> --
> Koduri Gopala Krishna,
> Cognitive Science Lab, IIIT - Hyderabad, India.
> Music Technology Group, UPF - Barcelona, Spain.
>
> Portfolio - http://tidbits.co.in
> తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
>
>
>
> 19 ఫిబ్రవరి 2011 4:12 సా న, Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxxxxxxx>ఇలా రాసారు :
>
> గోపాల్ గారు,
>>
>> 2011/2/19 Gopal/గోపాల్ <gopal.iiit@xxxxxxxxx>
>>
>> నమస్తే,
>>>
>>> అనువదించినపుడు మరీ ఫార్మల్ గా ఉన్న వాక్యాలు కొంచె నవీన పద్దతిలో రాస్తే
>>> వాడేవారికి "దగ్గరగా" ఉన్నట్టు ఉంటుంది. ఉదాహరణకి, "మూయుము" అనేకంటే "మూసివేయి"
>>> అంటే బావుంటుంది.
>>
>>
>> క్లుప్తమైన పదానికి ప్రాముఖ్యత యివ్వడం మంచిది. మూయు అన్నది లిబ్రెఆఫీసులో,
>> ఇతర వుపకరణాలలో వాడుతున్నాము.
>>
>> అలాగే, అప్పుడప్పుడు ఇంగ్లీషులో ఉన్న వాక్యంలో ఉన్న పదాల వరుస చాలా
>>> మార్చాల్సి ఉంటుంది. అలాంటప్పుడు అనువాదం "దూరం" వెళ్ళిపోతూందేమో అని చూడకుండా,
>>> వాడుకరులకు అర్థమవ్వడమే పరమావధిగా తథనుగుణంగా మార్చితేనే ఉపయోగకరం.
>>>
>>>
>> అంగీకరిస్తున్నాను.
>>
>> ధన్యవాదాలు
>> అర్జున
>>
>>>
>>>
>>
>
References