← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: కొన్ని అభ్యర్థనలు

 

గోపాల్ గారు,
ప్రస్థుతం వాడుకలోనున్న స్థానికీకరణ ఒకింత వాడుక భాషకు దూరంగానే ఉంది.మొ దట
స్థానికీకరణ చేసిన అనువాదాలు అలానే ఉండిపోయాయి కాని వాటిని నవీకరణ చేయడం గానీ
పున:పరిశీలన ఆ తర్వాత జరగకపోవడం వల్ల ఇప్పటికీ కొన్ని అలానే ఉండిపోయాయి.దీనిలో
కొన్ని మార్ఫులు చేసి పున:పరిశీలన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.మీ వంటివారు కూడా
తలో చేయి వేస్తే ఈ ప్రక్రియ సులభమవుతుందని అభిప్రాయపడుతున్నాను.అంతేకాకుండా
తెలుగు లినక్స్ వాడుకరులు కూడా వారి వారి సలహాలను, అభిప్రాయాలను పంచుకోవడం వలన
దీని అభివృద్ది సాధ్యమవుతుంది.

19 ఫిబ్రవరి 2011 4:51 సా న, Gopal/గోపాల్ <gopal.iiit@xxxxxxxxx> ఇలా రాసారు :

> నమస్తే,
>
> అనువదించినపుడు మరీ ఫార్మల్ గా ఉన్న వాక్యాలు కొంచె నవీన పద్దతిలో రాస్తే
> వాడేవారికి "దగ్గరగా" ఉన్నట్టు ఉంటుంది. ఉదాహరణకి, "మూయుము" అనేకంటే "మూసివేయి"
> అంటే బావుంటుంది. అలాగే, అప్పుడప్పుడు ఇంగ్లీషులో ఉన్న వాక్యంలో ఉన్న పదాల వరుస
> చాలా మార్చాల్సి ఉంటుంది. అలాంటప్పుడు అనువాదం "దూరం" వెళ్ళిపోతూందేమో అని
> చూడకుండా, వాడుకరులకు అర్థమవ్వడమే పరమావధిగా తథనుగుణంగా మార్చితేనే ఉపయోగకరం.
>
> Regards,
> --
> Koduri Gopala Krishna,
> Cognitive Science Lab, IIIT - Hyderabad, India.
> Music Technology Group, UPF - Barcelona, Spain.
>
> Portfolio - http://tidbits.co.in
> తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
>
>
> _______________________________________________
> Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
> Post to     : ubuntu-l10n-te@xxxxxxxxxxxxxxxxxxx
> Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
> More help   : https://help.launchpad.net/ListHelp
> --
>
*ధన్యవాదాలు,*
ప్రవీణ్.

References