ubuntu-l10n-te team mailing list archive
-
ubuntu-l10n-te team
-
Mailing list archive
-
Message #00053
window & window manager
నమస్తే,
ప్రస్తుతం జరుగుతున్న అనువాదాల్లో windows అనే పదానికి రెండు అనువాదాలున్నాయి.
ఒకటి యధాతథందా విండో అని వాడటం, ఇంకోటి గవాక్షము అని. విండో అని వాడటంలో కొన్ని
సమస్యలున్నాయి. ఒక తెలుగు పదాన్ని ఇంకో తెలుగు పదం తేలిగ్గా అక్కున
చేర్చుకుంటుంది. manager కి అభికర్త, నిర్వాహకి అని వాడుతున్నారు.
ఇప్పుడు window manager అని ఉన్న చోట, విండో అభికర్త లేదా విండో నిర్వాహకి
అంటే అది సంకర భాషలా తోస్తుంది. దాని కన్నా గవాక్షాభికర్త అంటే పొందికగా,
చక్కగా ఉంది. కాబట్టి విండో ని ఇకపై గవాక్షం అనే అందామా? (FUEL వాళ్ళు గవాక్షం
నుంచి విండో కి వచ్చారు కొత్త రివిజన్ లో).
Regards,
--
Koduri Gopala Krishna,
Cognitive Science Lab, IIIT - Hyderabad, India.
Music Technology Group, UPF - Barcelona, Spain.
Portfolio - http://tidbits.co.in
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
Follow ups