← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

ఉబుంటు 11.04 నాటీ నార్వాల్ విడుదల ప్రణాళిక

 

మిత్రులారా,

ఉబుంటు కొత్త వెర్షన్ ఉబుంటు 11.04 నాటీ నార్వల్ విడుదలకు సిద్ధమవుతోంది.
ఉబుంటు 11.04 నాటీ నార్వల్ విడుదల వివరాలు

1. ఉబుంటు 11.04 Alpha 1 (December)
2. ఉబుంటు 11.04 Alpha 2 (3 Feb 2011)
3.  ఉబుంటు 11.04 Alpha 3(3 Mar 2011)
4. ఉబుంటు 11.04 Beta 1 (31 March 2011)
5. ఉబుంటు 11.04 Beta 2(14 April 2011)
6. ఉబుంటు 11.04 Final Version (28 April 2011)

ప్రస్తుతం ఆల్ఫా 3 వెర్షన్ నడుస్తోంది.చివరి విడుదల(ఏప్రిల్ 28) కల్లా దాదాపు
అన్నిటినీ పూర్తిచేసి తెలుగు వారందరికీ ఉబుంటు లినక్స్ ను అందివ్వడానికే ఈ
ప్రయత్నం.అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఉబుంటు జట్టుని బలపరిచి మరింత అభివృద్ధి
పరుచుటకు కృషి చేయాలి.
రాబోవు ఉబుంటు వెర్షన్ను సాధ్యమైనంత వరకూ తెలుగులోకి స్థానికీకరించి, ఉన్న
వాటిని మెరుగుపరిచాలి.ప్రస్తుతం ఎల్లుండ అనగా మార్చి 31వ తేదీన బీటా వెర్షన్ 1
విడుదత అవుతోంది.వీలైతే దీనిని పరీక్షించి చేయవలసిన మార్పులను సూచించగలరు.

ఉబుంటు ప్రచార సామాగ్రి కోసం స్ప్రెడ్
ఉబుంటు<http://spreadubuntu.org/te/node/529>వెబ్ సైటును
సందర్శించండి.అక్కడ ఉన్న సామాగ్రిని వాడుకుని మీ బ్లాగులలో మరియు
సైటులలోను ప్రచారం చేయవచ్చు.

గమనిక: ఈ మెయిలుకు ఇబ్బంది పడకుండా స్వేచ్ఛగా స్పందించగలరు.

కొన్ని ఉపయోగపడే లింకులు.

https://launchpad.net/~ubuntu-l10n-te
https://wiki.ubuntu.com/AndhraPradeshTeam
http://ubuntu-ap.ubuntuforums.org
https://sites.google.com/site/linuxteluguusers/
*
*ఎక్కువ మంది స్పందనలను ఆశిస్తూ...

*ధన్యవాదాలు,*
ప్రవీణ్.

Follow ups